కార్‌ షోలో కాల్పులు.. 10 మంది రోడ్‌ రేసర్లు దుర్మరణం

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రోడ్ రేసర్లు మరణించారు.

By అంజి  Published on  21 May 2023 8:15 AM GMT
Mexico, Internationalnews, Baja California

కార్‌ షోలో కాల్పులు.. 10 మంది రోడ్‌ రేసర్లు దుర్మరణం

ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో జరిగిన కాల్పుల్లో కనీసం 10 మంది రోడ్ రేసర్లు మరణించారు. తొమ్మిది మంది గాయపడినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. బాజా కాలిఫోర్నియా స్టేట్ అటార్నీ జనరల్ ఆఫీస్ ప్రకారం.. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్-టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా ఈ దాడి జరిగింది. 911 కాల్‌ల రిపోర్ట్‌ ప్రకారం.. పొడవాటి తుపాకీలతో ఉన్న వ్యక్తులు బూడిద రంగు వ్యాన్ నుండి దిగి, మధ్యాహ్నం 2:18 గంటలకు (2118 GMT) గ్యాస్ స్టేషన్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపడం ప్రారంభించారని రాయిటర్స్ నివేదించింది. ఆ వెంటనే మునిసిపల్, రాష్ట్ర పోలీసులు, మెరైన్స్, ఫైర్ డిపార్ట్‌మెంట్, మెక్సికన్ రెడ్‌క్రాస్, ఇతర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర అటార్నీ జనరల్ రికార్డో ఇవాన్ కార్పియో సాంచెజ్ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు మేయర్ అర్మాండో అయాలా రోబుల్స్ తెలిపారు. బాధితుల గుర్తింపు లేదా జాతీయతలు ఇంకా బహిరంగపరచబడలేదు. మెక్సికో రెడ్‌క్రాస్ క్షతగాత్రులను ఉత్తర బాజా కాలిఫోర్నియాలోని ఆసుపత్రులకు తరలించిందని ఫాక్స్8 నివేదించింది.

Next Story