పెట్రోల్ బంకులో పేలుడు.. 10 మంది దుర్మరణం
10 people die in petrol station explosion in Ireland. ఐర్లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. డొనెగల్‌లోని పెట్రోల్ బంకులో పేలుడు సంభవించింది.
By అంజి Published on
9 Oct 2022 6:15 AM GMT

ఐర్లాండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. డొనెగల్‌లోని పెట్రోల్ బంకులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్రాథమిక పాఠశాల వయస్సు గల బాలికతో సహా పది మంది మరణించారు. ఈ విషయాన్ని ఐర్లాండ్ పోలీసులు శనివారం ధృవీకరించారు. ఈ ఘటనలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ పేలుడును పోలీసులు "విచిత్రమైన ప్రమాదం"గా అభివర్ణించారని స్థానిక మీడియా పేర్కొంది. శుక్రవారం యాపిల్‌గ్రీన్ పెట్రోల్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, కార్లతో సహా విస్తృతంగా నష్టం వాటిల్లింది. బాధితులు క్రీస్‌లౌ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు ధృవీకరించారు.
రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ యొక్క వాయువ్య కొనకు సమీపంలో ఉన్న ప్రాంతంలో క్రీస్‌లాఫ్ శివార్లలోని యాపిల్‌గ్రీన్ పెట్రోల్ స్టేషన్‌లో మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. అయితే మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం లేదని పోలీసులు చెప్పినట్లు నివేదికలు తెలిపాయి. పేలుడుకు కారణం తెలియరాలేదు. శిథిలాల ద్వారా అన్వేషణ కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story