పాకిస్థాన్‌లో పెట్రోల్ మంటలు..బంకు వద్ద కాల్పులు, ఒకరు మృతి

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతులో పెట్రోల్ కోసం ఎగబడిన జనం ఘర్షణకు దిగారు.

By -  Knakam Karthik
Published on : 8 March 2026 6:57 PM IST

International News, Pakistan News, Sialkot, PetrolShortage, US Iran Conflict, Global Fuel Crisis

పాకిస్థాన్‌లో పెట్రోల్ మంటలు..బంకు వద్ద కాల్పులు, ఒకరు మృతి

అమెరికా-ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడవచ్చన్న భయంతో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతులో పెట్రోల్ కోసం ఎగబడిన జనం ఘర్షణకు దిగారు. లాహోర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని సియాల్‌కోట్ - దస్కా రోడ్డులో ఉన్న ఒక పెట్రోల్ బంకు వద్ద శనివారం ఈ ఘటన జరిగింది.

పెట్రోల్ కొనుగోలు విషయంలో వినియోగదారులకు, బంకు సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహం చెందిన కొందరు కస్టమర్లు కాల్పులు జరపడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story