ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2020 1:45 PM GMTఅఫ్గానిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారి ప్రాణాలు కోల్పోయాడు. అప్గానిస్థాన్‌కు చెందిన షిన్వారి దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా విధులు నిర్వర్తించారు.
శనివారం మధ్యాహ్నం నంగహార్ ప్రావిన్స్‌లోని ఘనిఖిల్ జిల్లా గవర్నర్ ఇంటి వద్ద దుండగులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అంపైర్ షిన్వారి కూడా ఉన్నట్లు తెలిపారు.
Also Read
ఏంటీ బయో బబుల్.. నిబంధనలు అంత కఠినమా.?Next Story