ఉత్తర కొరియాలో కొత్త పట్టణాన్ని ఆవిష్కరించారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. పీక్టు పర్వత సమీపంలోని పూర్తిస్థాయిలో పునర్నిర్మించిన సంజీయోన్ అనే పట్టణం ఇది. ఈ పట్టణం కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మస్థలం కావడంతో కిమ్ ఈ ప్రదేశాన్ని మౌంటెన్ రిసార్ట్‌గా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ ప్రాజెక్టులో కొరియా విప్లవ కార్యకలాపాలకు సంబంధించిన ఒక మ్యూజియంతో పాటు, వింటర్ గేమ్స్ శిక్షణా శిబిరాలని, బ్లుబెరి, పొటాటో ప్రాసెసింగ్ యూనిట్లు వంటివాటిని కూడా ఏర్పాటు చేశారు. దీనితో పాటు పది వేలకు పైగా అపార్ట్‌మెంట్లు సైతం నిర్మించారు. కొరియాలోని అన్ని పట్టణాలు కంటే విభిన్నంగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దారు. పనిలోపనిగా తన ఫేవరెట్ తెల్లగుర్రం పై కిమ్ ఓ సారి ఆ పట్టణమంతా స్వారీ కూడా చేశారు. కావాలంటే మీరూ ఒకసారి చూడండి మంచుదుప్పటి కప్పుకున్న ఆ కొత్త పట్టణాన్ని.

 109982234 Hi058380021 Downloadfile 6 Img 20191204 093213 Kk5hiiavoyi6vagw2dfhabzhh4

అంజి

Next Story