ఎన్నికల ముందు ఇంటర్నల్..ఇప్పుడు ఎక్సట్రనల్..పవన్ పై బొత్స సెటైర్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Nov 2019 4:02 PM IST
ఎన్నికల ముందు ఇంటర్నల్..ఇప్పుడు ఎక్సట్రనల్..పవన్ పై బొత్స సెటైర్లు..!

ముఖ్యాంశాలు

  • ప్రస్తుతం రాజధానికి ఉన్నది టెంపరరీ అడ్రస్సే: మంత్రి బొత్స
  • తాట తీస్తా.. ఊరికొస్తా అంటూ పవన్‌ కామెంట్లు చేయడం సరికాదు

అమరావతి: ఎన్నికల ముందు ఇంటర్నల్‌.. ఇప్పుడు ఎక్సట్రనల్‌ అంటూ పవన్‌ కల్యాణ్‌ను మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. సినిమాల్లో చేసిన యాక్షనంతా రాజకీయాల్లో చేస్తున్నారని.. రాజకీయాల్లో యాక్షన్‌ పనికి రాదని పవన్‌కు సూచించారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఆకృత్యాలు జరిగినా హీరోగారు ఎందుకు స్పందించలేదన్నారు. రాజధాని బంగారు బాతు కాదు.. అడ్రస్‌ లేని బాతులా తయారయ్యిందన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ. రాజధానిని బంగారు బాతులా చేశామంటూ చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారు. మరీ ఇప్పుడీ బంగారు బాతు ఎక్కడ ఉందన్నారు. రాజధానిపై కమిటీ వేశామని... త్వరలోనే రాజధాని అడ్రస్‌ చెబుతామన్నారు. ప్రస్తుతం రాజధానికి ఉన్నది టెంపరరీ అడ్రస్సేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఇక చంద్రబాబుకు ఆయన ఫ్రెండ్‌ తోడయ్యారు.

సమయం, సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు. బీజేపీలో రెండు రకాల వాయిస్‌లు వినిపిస్తున్నాయన్నారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పర్యటించి ఏం చూస్తారు? కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు చూస్తారా? అంటూ మంత్రి బొత్స ప్రశ్నించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలన్నదే చంద్రబాబు థియరీ. అవినీతి విషయంలో చంద్రబాబు ఈ థియరీని ఫాలో అవుతారని మంత్రి బొత్స విమర్శించారు. 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చానన్న పవన్‌.. ఇంకా 15 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. చంద్రబాబు పని అయిపోయింది. తాట తీస్తా.. ఊరికొస్తా అంటూ పవన్‌ కామెంట్లు చేయడం సరికాదన్నారు. సీఎస్‌, సెక్రటేరీల బదిలీలు సహజమేనన్నారు. మంత్రులు వస్తూ ఉంటారు.. మారుతూ ఉంటారు.. అలాగే సీఎస్‌ల బదిలీ కూడా ఉంటుందని మంత్రి బొత్స అన్నారు. పవన్‌కు భవన కార్మికుడి డెఫినేషన్‌ తెలుసా? అంటూ ప్రశ్నించారు. తట్టా, బుట్టా పట్టుకున్న ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ కార్మికుడు కాదన్నారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ తెచ్చిన జీవోను రద్దు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు.

Next Story