జూన్ 3న వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు
By తోట వంశీ కుమార్ Published on 31 May 2020 2:27 PM GMTలాక్‌డౌన్‌తో వాయిదా పడిన తెలంగాణ ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. జూన్ 3న ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజెస్ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి సయీద్ ఉమర్ జలీల్ వెల్డించారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనని, కరోనా పరిస్థితుల వల్ల పరీక్షకు హాజరు కాలేకపోతే మరోసారి అవకాశం ఉంటుందన్నారు.ఇప్పుడు రాయలేని వారు జూలై మూడో వారంలో జరిగే సప్లిమెంటరీ పరీక్ష రాయవచ్చని తెలిపారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్‌గానే పరిగణిస్తామని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలు జూన్ 1న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని జూనియర్ కాలేజీల పునఃప్రారంభం వాయిదా వేసినట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. కళాశాలు ఎప్పుడు ప్రారంభం అయ్యేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.