యాపిల్స్ గురించి మీకు తెలియని నిజాలు..
By అంజి Published on 31 March 2020 8:22 AM GMTరోజుకో యాపిల్ పండు తినడం వల్ల వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఓ సామెత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. యాపిల్ మనం రోజు తినే ఆహారంలో ముఖ్యమైన పండుగా అయిపోయింది. భూమిపైన రుచికరమైన ప్రాచుర్యం పొందిన, పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్ ఒకటి. యాపిల్ తియ్యని పదార్థం. దీని జ్యూసీ రుచి ఒక సహజ దివ్యత్వాన్ని కలగి ఉంటుంది. అయితే యాపిల్ సంబంధించిన ఎంతో చరిత్ర ఉంది.
మొదటి సారి యాపిల్ టిబెట్‌లోని ఎత్తైన పర్వాతాలపై కనిపించింది. దీనిని తొలుత తినకూడదని భావించారు. విషపూరితమైనది.. తింటే ప్రాణాలు పోతాయని భయపడ్డారు. ఆ తర్వాత కాలంలో యాపిల్‌ను కొద్దిగా కొరుక్కు తిన్నారు. అలా యాపిల్ రుచి ప్రపంచానికి తెలిసింది. యాపిల్ యొక్క పూర్వీక అడవి జాతి రకం ఇప్పటీకి మధ్య ఆసియాలో కనబడుతుంది. ఇక్కడి నుంచి యాపిల్స్ పుట్టుకోచ్చాయని అందరూ భావిస్తారు.
Also Read: పెసర్లు తింటే ఆ సమయంలో అలసట రాదట..
ఆరోగ్యానికి సంబంధించి యాపిల్స్‌లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యాపిల్స్‌లో అధిక పోషకాలు ఉంటాయి. నోటి ఆరోగ్యం సరిగా ఉండేందుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సాయం చేస్తాయి. యాపిల్‌లోని ఫైబర్ కంటెంట్ కడపు సమస్యలు, బరువు తగ్గడానికి సంబంధించి మంచి మెడిసన్‌గా పని చేస్తుంది. యాపిల్‌లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్స్ పండ్ల సాధారణ వినియోగం వల్ల డయాబెటిస్ ప్రమాదం 18 శాతం వరకు తగ్గేందుకు దారి తీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణక్రయిను మెరుగుపర్చడంలో కూడా యాపిల్ పీచు పదార్థం సాయపడుతుంది.
మీకు తెలుసా..
ప్రపంచంలో 8 వేల రకాల యాపిల్స్ ఉన్నాయి.
అన్ని రకాలుగా యాపిల్స్ తినాలంటే 21 ఏళ్లు పడుతుందట.
పండ్లలో ఎక్కువ రకాలున్నవి యాపిల్సే.
బ్లాక్ డైమండ్ యాపిల్ అత్యంత అరుదైనదిగా గుర్తింపు పొందింది.
ఒక్కో సెకాయ్ ఇచి యాపిల్ ధర రూ.1500.
యాపిల్స్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా.
మొట్టమొదటి సారిగా యాపిల్ జన్యుపటాన్ని డీకోడ్ చేశారు.
ప్రపంచలోనే అత్యంత పెద్ద యాపిల్ బరువు 1.849 కేజీలు.. ఇది జపాన్ దేశంలో అక్టోబర్ 24, 2005లో కాసింది.
పూర్వం యాపిల్స్‌ని గ్రీక్, రోమన్లు ఐశ్యర్యంగా భావించారు.
ప్రపంచంలో యాపిల్‌ని చూసి భయపడేవాళ్లు కూడా ఉన్నారట.