ఇండోనేషియాలో విచిత్రం.. గర్భందాల్చిన గంటకే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 July 2020 8:44 AM GMT
ఇండోనేషియాలో విచిత్రం.. గర్భందాల్చిన గంటకే

Indonesian Housewife and Her One Hour Pregnancy ఈ ప్రపంచంలో ఏ తల్లి కడుపులోని బిడ్డ అయినా నవ మాసాల తర్వాతే బయటికి వస్తుంది. కానీ ఇండోనేషియాలో మాత్రం సృష్టికి విరుద్ధంగా ఒక ఘటన జరిగింది. ఓ మహిళ గర్భవతి అయిన గంటకే పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. దాంతో ఆ మహిళ ఓవర్ నైట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది.

ఇండోనేషియాకు చెందిన హేని సురేని అనే మహిళ 19 నెలలుగా తన భర్తకు శారీరకంగా దూరంగా ఉంటోంది. కానీ ఇటీవల ఒక రోజు ఆమె గర్భం దాల్చిందన్న విషయం తెలిసింది. గర్భవతి అయిన గంటలోనే వాంతులు, కడుపు ఉబ్బి నొప్పులు వచ్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా హేని సురేనినే వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అదెలా సాధ్యం అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. నిజమే కదా..సృష్టిలో ఏ తల్లి అయినా బిడ్డను కనడం జన్యుపరమైన విషయం. కానీ హేని మాత్రం తన భర్తతో కలవకుండానే బిడ్డనెలా కన్నది అనే విషయం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. అసలు హేని సురేని గర్భవతి అయిన గంట వ్యవధిలోనే బిడ్డకు ఎలా జన్మనిచ్చిందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాయి వైద్యులు, మీడియా.

కాగా..ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్లు ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేస్తున్నారు. నవమాసాలు మోయకుండా గంటలో పిల్లల్ని కనడం అసాధ్యమని కామెంట్లు చేస్తున్నారు.

Next Story