సింగపూర్‌లో భారత యువకుడికి ఏడాది జైలు..ఎందుకో తెలిస్తే..
By Newsmeter.Network Published on 6 Dec 2019 7:41 PM ISTసింగపూర్‌లో భారత యువకుడికి ఏడాది జైలు శిక్ష విధించింది అక్కడ న్యాయస్థానం. పైగా 15 లక్షల జరిమానా కూడా విధించింది. వ్యభిచార కార్యకలపాలు నిర్వహిస్తున్న 22 ఏళ్ల భారత యువకుడు సింగపూర్‌లో అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడికి అక్కడి న్యాయస్థానం ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత కొంతకాలంగా సింగపూర్‌లో ఉంటున్న అశోక్ కుమార్ మనోగరన్ (22) అనే యువకుడు వ్యభిచార కార్యక్రమాల దందా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 3,360 మంది క్లైంట్స్ వద్ద నుంచి మోసపూరితంగా భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు. కాగా, అశోక్ గ్యాంగ్ విటులకు అమ్మాయిలను తీసుకొస్తానని చెప్పి మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని పరారయ్యేవారని పోలీసులుతెలిపారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగిన మనోగరన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంకేముందు అసలు విషయం బయటపడింది. తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో అశోక్‌పై నమోదైన మూడు అభియోగాల్లో అతడు దోషిగా తేలాడు. 2017, డిసెంబర్ నుంచి 2018, డిసెంబర్ వరకు ఏడాది కాలంలో అతను వ్యభిచార కార్యక్రమాల ద్వారా రూ. 44లక్షలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తేలింది.దీంతో దోషిగా తేలిన అశోక్‌కు న్యాయస్థానం ఏడాది జైలు, రూ. 15 లక్షలకు పైగా ఫైన్ విధించింది. ఒకవేళ అతను జరిమానా కట్టలేకపోతే మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది.