రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు..!
By సుభాష్ Published on 20 July 2020 1:40 PM ISTభారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రైవేటు రైళ్లను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రెండు రూట్లలో ప్రైవేటు రైళ్లను నడిపే బాధ్యత ఐఆర్‌సీటీసీకి అప్పగించింది. అయితే ఆ ప్రయోగం విజయవంతం కావడంతో మరో 151 ప్రైవేటు రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు తయారు చేసోతోంది. దశలవారీగా ఈ ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో 2023 నాటికి 12 ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇలా 2027 నాటికి మొత్తం 151 ప్రైవేట్ రైలు సర్వీసులను దశలవారీగా అందించాలన్న అంచనా వేస్తోంది రైల్వేశాఖ. దేశంలో 109 రూట్లలో ఈ 151 ప్రైవేటు రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. మొత్తం 30వేల కోట్ల ప్రైవేటు సెక్టార్ ఇన్వెస్ట్ మెంట్ వస్తుందని అంచనా వేస్తోంది.
కాగా, రైల్వేశాఖ ప్రణాళిక ప్రకారం.. 2020-23లో 12 రైళ్లు, 2023-24లో 45 రైళ్లు, 2025-26లో 50 రైళ్లు,2026-27లో 44 ప్రైవేటు రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీటిని నడిపేందుకు ప్రైవేటు కంపెనీల నుంచి ప్రపోజల్స్ ఆహ్వానించింది రైల్వే. నవంబర్ నాటికి వీటిని ఫైనల్ చేసి, 2021 మార్చి నాటికి టెండర్లను పూర్తి చేసి 2023 మార్చి నాటికి ప్రైవేటు రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
కాగా, 70శాతం ప్రైవేటు రైళ్లు భారత్‌లోనే తయారవుతాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. దీని వల్ల ప్రయాణ సమయం 30శాతం తగ్గుతుందని. అదే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ప్రయాణ సమయం 10 నుంచి15 శాతం తగ్గే అవకాశం ఉంది. భారతీయ రైల్వే ఇప్పటికే నడుపుతున్న రైళ్లతో పోలిస్తే ఈ ప్రైవేటు రైళ్లు ఇంకా వేగంగా ప్రయాణిస్తాయని అధికారులు చెబుతున్నారు.