రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌

By సుభాష్  Published on  2 Jan 2020 1:34 PM GMT
రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌

రైల్వే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం రైల్వే శాఖ మ‌రో ముంద‌డుగు వేసింది. భార‌త రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబ‌ర్ 139ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ నంబ‌ర్ జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి తెచ్చింది రైల్వేశాఖ‌. గ‌తంలో స‌మాచారం కోసం ప‌లు ర‌కాల స‌హాయ‌క నంబ‌ర్ల‌నుఅందుబాటులో ఉండ‌గా, ప్ర‌యాణికుల‌కు అన్ని ర‌కాల సేవ‌ల కోసం ఒకే నంబ‌ర్‌ను కేటాయిస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో పాటు ప్ర‌యాణికుల కోసం రైల్ మాడాడ్ అనే యాప్‌ను కూడా లాంచ్ చేసింది. ఇక 139తో పాటు పాటు రైల్ మాడాడ్ పోర్ట‌ల్‌తో అన్ని సేవ‌లు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు రైల్వేశాఖ పేర్కొంది.

ఇది వ‌ర‌కు సాధార‌ణ ఫిర్యాదుల కోసం 138, క్యాట‌రింగ్ సేవ‌ల‌కు 1800111321, విజిలెన్స్ సేవ‌ల కోసం 52210, ప్ర‌మాదాలు, భ‌ద్ర‌త వంటి సేవ‌ల కోసం 1072, క్లీన్ మై కోచ్ వంటి సేవ‌ల కోసం 58888/138, ఎస్ ఎంఎస్ ఫిర్యాదుల కోసం 9717630982 వంటి స‌హాయ‌క హెల్ప్ నంబ‌ర్లు అందుబాటులో ఉండేవి. కాని ఇక జ‌న‌వ‌రి నుంచి ఈ నంబ‌ర్లు ప‌ని చేయ‌వ‌ని రైల్వే శాఖ పేర్కొంది.

Next Story