ఢిల్లీ: సుప్రసిద్ధ భారతీయ కార్టూనిస్ట్ సుధీర్‌ దార్‌ గుండె పోటుతో మృతి చెందారు. ఈయన వయసు 87 సంవత్సరాలు. సుధీర్‌ దార్‌ తన 58 సంవత్సరాల కెరీర్‌లో అనేక ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలతో, పత్రికలతో కలసి పనిచేశారు. 1960 నుండి 2000 వరకు పనిచేసిన ఆర్కే లక్ష్మణ్‌, ఓ.వీ. విజయన్‌, రాజిందర్‌ పురి, అబు అబ్రహాం వంటి భారత దేశపు రెండవ తరం కార్టూనిస్టులలో ఈయన ఒకరు. దార్‌ 1932లో అలహాబాద్‌లో జన్మించారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నుండి భూగోళ శాస్ర్తంలో ఎమ్మే పూర్తి చేశారు. సుధీర్‌ దార్‌ కార్టూన్లు.. న్యూయార్క్‌ టైమ్స్‌, ద ఇండిపెండెంట్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, ద పయొనీర్‌, ఢిల్లీ టైమ్స్‌, మాడ్‌ మాగజైన్‌ వంటి అంతర్జాతీయ పత్రికలలో కూడా మెరిశాయి. దార్‌ ఓ మంచి రచయిత కూడా.. కొన్ని ప్రతిష్టాత్మకమైన పుస్తకాలను కూడా ఆయన రచించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్