మనదే హవా.. సఫారీలను వణికించిన టీమిండియా బౌలర్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 1:38 PM GMT
మనదే హవా.. సఫారీలను వణికించిన టీమిండియా బౌలర్లు

పుణే: భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. శనివారం ఆటలో కూడా టీమిండియాదే పైచేయి. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 105.4 ఓవర్లు ఆడి 275 పరుగులకే కుప్పకూలింది.

Shami struck early to get rid of nightwatchman Nortje.

భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (4/69), ఉమేశ్‌ యాదవ్ ‌(3/37), మహ్మద్‌ షమీ (2/44) గొప్పగా బౌలింగ్‌ చేశారు.

The procession continued post lunch as well.

పుణె టెస్టులోనూ పర్యాటక బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శన చేశారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో భారత సంతతి క్రికెటర్‌ కేశవ్‌ మహరాజ్‌(72: 132 బంతుల్లో 12ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు.

Ashwin then picked up his first wicket just before the lunch break as India continued to be on top.

టీమిండియా బౌలింగ్‌ దళం ధాటిగా బంతులేస్తున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఎలాంటి తడబాటు లేకుండా స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. కేశవ్‌తో పాటు ఫిలాండర్‌ (44: 192 బంతుల్లో 6ఫోర్లు) కూడా తనదైన శైలిలో పరుగులు సాధించాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో డుప్లెసిస్‌(64) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడే ప్రయత్నం చేసినా భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమయ్యాడు. ఆట మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. సఫారీలను టీమిండియా జట్టు ఫాలో ఆన్ ఆడిస్తుందా..? లేక రేపు ఒక సెషన్ పాటు బ్యాటింగ్ చేసి తర్వాత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందా..? అనేది ఆదివారం ఉదయం తేలనుంది.

Ashwin struck twice right before stumps to give India a lead of 326 runs.



Next Story