పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ భీకర దాడులు..50 మంది టెర్రరిస్ట్ ల హతం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 12:41 PM GMT
పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ భీకర దాడులు..50 మంది టెర్రరిస్ట్ ల హతం..!

కశ్మీర్‌: పీవోకేలోని పాక్ ఉగ్రస్ధావరాలపై భారత్ ఆర్మీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. భారత్‌లో చొరబడటానికి సిద్ధంగా ఉన్న 50 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు సమాచారం అందుతుంది. భారత్ దాడిలో చనిపోయిన వారిలో 7 మంది పాక్ కమాండర్లు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం 57 మంది చనిపోయినట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు.

రెండ్రోజుల క్రితం భారత్ ఆర్మీ హైవిట్జర్ గన్స్‌తో పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నాలుగు టెర్రర్‌ క్యాంపులను భారత్ ఆర్మీ నేలమట్టం చేసింది. 10 నుంచి 20 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని కూడా ఆర్మీ ప్రకటించింది.

ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్ లోకి ఉగ్రవాదులను పంపడానికి పాక్ కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే..పీవోకేలో టెర్రర్‌ క్యాంపులు భారీ ఎత్తున నిర్వహిస్తుంది. ఇవన్నీ కూడా పాక్‌ ఆర్మీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. కశ్మీర్‌లో భద్రతాబలగాలను తగ్గించిన వెంటనే ఉగ్రదాడులకు పాక్‌ ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగానే టెర్రరిస్ట్‌లను భారీ ఎత్తున ప్రవేశపెట్టడానికి పాక్ కుటిల పన్నాగాలు పన్నుతుంది. అయితే..భారత్‌ కూడా ధీటుగా స్పందిస్తూ..పాక్ ఉగ్రవాదులను హతమారుస్తుంది.

Next Story
Share it