ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ ఉంటే చాలు

By అంజి  Published on  20 Jan 2020 11:21 AM IST
ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు.. ఇంటర్‌ ఉంటే చాలు

దేశ సేవ చేసేందుకు ఎంతో మంది యువత కలలు కంటూ ఉంటారు. భారత త్రివిధ దళాల ఉద్యోగాల పట్ల యువతకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. అలాంటి వారి కోసమే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రత్యేక ప్రకటన వెలువరించచింది. ఇంటర్మీడియట్‌ అర్హతతో గ్రూప్‌-ఎక్స్‌, వై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఉంటే చాలని, డిగ్రీ కూడా అవసరం లేదని తెలిపింది. కేవలం ప్రవేశ పరిక్ష రాసి, తమ ప్రతిభను కనబర్చిన వారు ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. గ్రూప్‌ ఎక్స్‌, వై ట్రేడుల్లో చేరిన తర్వాత ఫిట్టర్‌ లేదా టెక్నీషియన్‌గా కేరీర్‌ ప్రారంభం అవుతుంది. మొదటి నుంచే రూ.50 వేల జీతం వస్తుంది. మంచి వేతనం, భద్రతాపరమైన ఉద్యోగం మధ్య తరగతి యువత కల. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత పదోన్నతులు కూడా ఉంటాయి. ఫ్యూచర్‌లో మాస్టర్‌ వారెంట్‌ ఆఫీసర్‌ స్థాయి వరకు వెళ్లవచ్చు.

గ్రూప్‌-ఎక్స్‌: ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఇంగ్లీష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో మాంచి పట్టుండాలి. అలాగే ఇంటర్‌ లేదా ప్లస్‌ 2లో కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఎదైనా డిప్లొమా కోర్సులో నైనా 50 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో మాత్రం 50 మార్కులు తప్పనసరి. ఇంటర్‌ లేదా 10వ తరగతిలో ఇంగ్లీష్‌ కనీసం 50 మార్కులు ఉండాలి.

గ్రూప్‌-వై: ఈ ఉద్యోగంలో చేరాలనుకునే వారు ఇంటర్‌లో ఏ గ్రూప్‌ అయిన 50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఇంగ్లీష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులు మాత్రం తప్పనిసరి. మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ ఉద్యోగాలకు మాత్రం బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో 50 శాతం ఉత్తీర్ణత ఉండాలి.

ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివిన విద్యార్థులు పై రెండు గ్రూప్‌లు ఉద్యోగాలకు అర్హులే. నచ్చిన గ్రూప్‌లో దరఖాస్తు చేసుకొని పరీక్ష రాయవచ్చు. లేదంటే రెండు గ్రూప్‌లకు కలిపి నిర్వహించే పరీక్షను కూడా రాయవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అట్టి విషయాన్ని తెలియజేయాలి. డిప్లొమా విద్యార్థులు కేవలం గ్రూప్‌ ఎక్స్‌ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు.

అర్హుతలు:

వయసు: జవనరి 17, 2000 నుంచి డిసెంబర్‌ 30, 2003 మధ్య జన్మించి ఉండాలి

ఎత్తు: కనీసం 152.5 సెం.మీ

ఛాతీ వ్యత్యాసం: ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత 5 సెం.యమీ

కంటి చూపు సరిగా ఉండాలి, వినికిడి సామర్థ్యం సృష్టంగా ఉండాలి

ఎంపిక: పేజ్‌-1, ఫేజ్‌-2 పరీక్షల ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20, 2020

ఆన్‌లైన్‌ పరీక్షలు: మార్చి 19 నుంచి 23 వరకు

http://indianairforce.nic.in/

https://airmenselectin.cdac.in

Next Story