ఐకరాజ్య సమితి వేదికగా టర్కీ దేశానికి.. భారత్‌ హెచ్చరిక

By అంజి  Published on  28 Feb 2020 8:23 AM GMT
ఐకరాజ్య సమితి వేదికగా టర్కీ దేశానికి.. భారత్‌ హెచ్చరిక

జెనీవా: పాకిస్తాన్‌ మిత్రదేశం టర్కీకి భారత్‌ మరోసారి చురకలంటించింది. భారత్‌ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలపై టర్కీ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాగా జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 43వ వార్షికోత్సవం వేదికగా టర్కీకి భారత్‌ దీటుగా సమాధానం చెప్పింది. ఈ సమావేశంలో మరోసారి కశ్మీర్‌ అంశాన్ని పాకిస్తాన్‌ లెవనేత్తే ప్రయత్నం చేసింది. దీనికి దీటుగా భారత ప్రతినిధి విమర్శ ఆర్యన్‌ సమాధానం చెప్పారు.

ప్రజాస్వామ్య విలువలను అర్థం చేసుకోవాలని నడవాలని హితవు పలికారు. ఇదే సమయంలో టర్కీని కూడా భారత్‌ అంతర్గత విషయాల్లోకి రావద్దని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దని గట్టిగా చెప్పారు. అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ భారత్‌పై విమర్శలు చేయడం ఇదేమి కొత్త కాదు. ఆయన చాలా సార్లు భారత్‌ వ్యతిరేకంగా విమర్శలు చేశారు. కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు తెలిపారు. అయితే యూఎన్‌ఓ జనరల్‌ బాడీ మీటింగ్‌ సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి విమర్శలు పాలు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా పౌరసత్వ సవరణ చట్టంపై లేని పోని ఆరోపణలు చేశారు. భారత చట్టాలపై అవగాహన లేకుండా ఆరోపణలు చేయడంతో.. భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

'ఏవిధమైన ఊచకోత.. ముస్లింల ఊచకోత.. ఎవరిచేత.. హిందువుల చేత..' అంటూ టర్కీ అధ్యక్షుడు ఢిల్లీ అల్లర్లపై కామెంట్‌ చేశారు. కొందరు నిరసనకారులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వారు ప్రపంచశాంతి కోసం ఏలా పాటుపడుతారని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే జాబితా నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. కశ్మీర్‌ అంశానికి టర్కీ దేశం న్యాయం, శాంతి, చర్చలవైపు నిలుస్తుందన్నారు.

Next Story