నగరంలో నరమేథం - ఇలా మొదలైంది.!

By అంజి  Published on  28 Feb 2020 5:37 AM GMT
నగరంలో నరమేథం - ఇలా మొదలైంది.!

ఫిబ్రవరి 22: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 500 మంది మహిళలు ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రోడ్డుపై ఉదయం 11 గంటలకు బైఠాయించారు.

ఫిబ్రవరి 23: పోలీసులు దిగ్బంధనానికి గురైన రోడ్డును ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు అక్కడినుంచి కదలమని భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు శాంతి కమిటీ సభ్యులను పిలిపించి, వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అదే రోజు ఈశాన్య ఢిల్లీ పోలీస్ డీజీపీ వేద్ ప్రకాశ్ సూర్య పక్కన నిలబడ్డ బిజెపి నేత కపిల్ మిశ్రా పోలీసులు, ఆందోళనకారులను తక్షణమే ధర్నాను ఆపేయాలని హెచ్చరించారు.

ఆ తరువాతే ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి మొదలైంది. ఈ రాళ్లదాడిలో పదిహేను మంది గాయపడ్డారు. పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తం. ఆ తరువాత జాఫ్రాబాద్, మౌజ్ పూర్, చాంద్ బాగ్, బాబర్ పూర్, కబీర్ నగర్ లలో హింస ప్రారంభం.

ఫిబ్రవరి 24: మౌజ్ పూర్ చౌక్ లో సీ ఏ ఏ మద్దతుదారులు ఊరేగింపు నిర్వహించారు. కబీర్ నగర్ లో సీఏఏ వ్యతిరేకులు ఊరేగంపు నిర్వహించారు. ఇరు వర్గాలు ఎదురెదురు రాగానే రాళ్ల వర్షం కురిసింది. ఇది మత ఘర్షణగా రూపు దాల్చింది.

మధ్యాహ్నం తరువాత అల్లరి మూకలు వాహనాలను, దుకాణాలను, ఇళ్లను తగులబెట్టారు. గోకుల్ పురిలో కానిస్టేబుల్ రతన్ లాల్ ను కిరాతకులు హత్య చేశారు. డీసీపీ అమిత్ శర్మ ను వాహనం నుంచి లాగి రాళ్లతో కొట్టారు. ఆయన వాహనాన్ని తగులబెట్టారు.

ఫిబ్రవరి 25: మౌజ్ పూర్, భజన్ పురా, కరావల్ నగర్, జాఫ్రాబాద్, కర్దమ్ పురి, చాంద్ బాగ్, కబీర్ నగర్, బ్రహ్మపురి, బాబర్ పూర్, గోరఖ్ పార్కులకు విస్తరించిన మతఘర్షణలు. ఆర్ ఏ ఎఫ్ దళాల మొహరింపు

ఫిబ్రవరి 26, 27: హింసాత్మక సంఘటనలు తగ్గిపోయాయి. పోలీసులు, పారామిలటరీ బలగాల భారీ మొహరింపు. కానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు చనిపోవడం, కొత్త మృతదేహాలు డ్రెయినేజ్ లో లభ్యం కావడంతో చనిపోయిన వారి సంఖ్య పెరిగింది.

మొత్తం చనిపోయిన వారి సంఖ్య 38 కి పెరిగింది. 265 మంది గాయపడ్డారు.

ఎలా చనిపోయారు?

తుపాకీ కాల్పుల్లో – ఇషాక్ ఖాన్ (24), మహ్మద్ ముదస్సర్ (30). వీర్ భాన్ (50), మహ్మద్ ముబారక్ హుస్సేన్ (28), షాన్ మహ్మద్ (28), రాహుల్ సోలంకీ (26), షాహిద్

కత్తిపోట్లు – అష్ఫాఖ్ (22), జాకిర్ (24).

దాడి – మెహతాబ్ (22), మహ్మద్ ఫుక్రాన్ (30), రాహుల్ ఠాకూర్ (23), అంకిత్ శర్మ (25), రతన్ లాల్ (24), దీపక్ (34), దిల్ బర్.

మిగతా వారి పేర్లు తెలియరాలేదు.

Next Story