భారత్‌లో కొత్తగా 73,272 పాజిటివ్ కేసులు
By సుభాష్Published on : 10 Oct 2020 11:37 AM IST

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,64,018 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 73,272 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు దేశంలో 69,79,424 కేసులు నమోదు అయ్యాయి. ఇక కొత్తగా 926 మంది మరణించగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1,07,416కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటి వరకు దేశంలో రికవరీ సంఖ్య 59,88,822 ఉండగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య8,83,185 ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.65శాతం ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు క్రమ క్రమంగా పెరుగుతోంది. దేశ వ్యాప్తం కరోనా కేసుల లెక్క 70 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 8,57,98,698 పరీక్షలు నిర్వహించారు.
Also Read
తెలంగాణలో కొత్తగా 1,811 పాజిటివ్ కేసులుNext Story