24 గంటల్లో..68వేల కేసులు.. 983 మరణాలు

By సుభాష్  Published on  21 Aug 2020 5:46 AM GMT
24 గంటల్లో..68వేల కేసులు.. 983 మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ప్రతి రోజు పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 68,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 29,05,823కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 21 లక్షల 58వేల మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 6 లక్షల మంది యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇక నిన్న ఒక్క రోజే కోవిడ్‌తో 983 మంది మృతి చెందారు. దంతో దేశంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 54,849కి చేరింది. దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిన్న ఒక్క రోజే 62వేల మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73.91 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.90 శాతంగా ఉంది.

ఇదిలా ఉండగా, భారత్‌లో కరోనా పరీక్షలు భారీగానే నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు దాదాపు 9 లక్షల శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 8 లోల 5వేల శాంపిళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 3 కోట్ల 34 లక్షల శాంపిళ్లకు కరోనా పరీక్షలు పూర్తి చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

Next Story