దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

By సుభాష్  Published on  20 Aug 2020 11:05 AM IST
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

భారత్‌ కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇక కొత్తగా 977 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926 చేరుకోగా, మరణాల సంఖ్య 53,866కు చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో 6,86,395 కేసులు యాక్టీవ్‌లో ఉండగా,20,96,664 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58వేలకుపైగా కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇక అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ ఉండగా, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత మూడు లక్షల కరోనా కేసులు దాటిన మూడో రాష్ట్రంగా ఏపీ ఉంది. ఇక మహారాష్ట్రలో 13,165 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 9,18,470 కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 3,26,61,252 పరీక్షలు నిర్వహించారు.

ఇవీ చదవండి:

► తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల..ఈ రోజు ఎన్ని కేసులంటే..

► హైదరాబాద్‌లో గత 35 రోజుల్లో 6.60లక్షల మందికి కరోనా: సీసీఎంబీ పరిశోధన వెల్లడి

Next Story