దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,99,857 కరోనా పరీక్షలు నిర్వహించగా, 72,049 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు 67,57,132 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇక కొత్తగా 986 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకు దేశంలో మరణాల సంఖ్య 1,04,555కు చేరింది.

నిన్న ఒక్క రోజే 82,203 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య57,44,693కు చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,07,883 యాక్టివ్‌ కేసులుండగా, రికవరీ రేటు 85.02 శాతం ఉంది. ఇక మరణాల రేటు 1.55 శాతం ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

సుభాష్

.

Next Story