భారత్ లో 600 దాటిన మరణాలు..

By రాణి  Published on  21 April 2020 9:09 PM IST
భారత్ లో 600 దాటిన మరణాలు..

భారత్ లో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో కనిష్ఠంగా 900 పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం సాయంత్రం కేంద్రం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ఆధారంగా దేశంలో 18,985 కేసులు నమోదవ్వగా 3,260 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 603 కు చేరింది. మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ముంబైలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 4,669 కేసులు నమోదవ్వగా 572 మంది కోలుకున్నారు. 232 మంది మృతి చెందింది. ఒక్క మహారాష్ట్రలోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆ రాష్ట్రీయులను కలవరపెడుతోంది. మరే రాష్ట్రంలోనూ మృతుల సంఖ్య ఇంత వరకూ 100 దాటలేదు. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా మధ్య ప్రదేశ్ లో 76 కరోనా మరణాలు నమోదయ్యాయి.

Also Read : కోవిడ్ పేషెంట్ల కోసం వెంటిలేటర్ రూపొందించిన మాజీ ఎంపీ

ఇక గడిచిన 24 గంటల్లో 705 మంది కోలుకుని డిశ్చార్జవ్వగా..కొత్తగా 1336 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తమిళనాడులో 25 మంది విలేకరులకు, మహారాష్ట్రలో 25 మంది పారా మెడికల్ సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్థారణయింది. కొత్తగా రాజస్థాన్ లో 52, ఒడిశాలో 5, ఏపీలో 35, కర్ణాటకలో 10, కేరళలో 19, తెలంగాణలో 56 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో మొత్తం 928 కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య 23కి పెరిగింది. మరో 196 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఏపీలో మొత్తం 757 కేసులు నమోదవ్వగా ప్రస్తుతం 639 మందికి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. మరో 96 మంది డిశ్చార్జవ్వగా, మృతుల సంఖ్య 22కు చేరింది.

Also Read : మతపెద్దలను ఆదుకునేందుకు ఏపీ ప్రత్యేక జీఓ

Next Story