భార‌త్‌లో 10వేల‌మంది కోలుకున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2020 3:10 PM GMT
భార‌త్‌లో 10వేల‌మంది కోలుకున్నారు

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నియంత్రించ‌డానికి అనేక చ‌ర్య‌లు చేప‌ట్టినా కూడా రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,411 కేసులు న‌మోదు కాగా.. 71 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 37,776క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 1,223 మంది మ‌ర‌ణించారు. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 10,018 మంది కోలుకోన్నారు. ప్ర‌స్తుతం 26,563 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తొమ్మిదికి పైగా రాష్ట్రాల్లో వెయ్యికి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైయ్యాయి. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 11,506 కేసులు న‌మోదు కాగా.. 485 మృతి చెందారు. గుజ‌రాత్(4721), ఢిల్లీ(3738), మ‌ధ్య‌ప్ర‌దేశ్(2719)‌, రాజ‌స్థాన్‌(2666), త‌మిళ‌నాడు(2526), యూపీ(2455), ఆంధ్ర‌ప్ర‌దేశ్(1525), తెలంగాణ(1057) రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story