భార‌త్‌లో 24 గంటల్లో 1993 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 5:10 AM GMT
భార‌త్‌లో 24 గంటల్లో 1993 కేసులు

భార‌త్‌లో క‌రోనా మ‌హామ్మారి విజృంభిస్తోంది. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ను విధించిన‌ప్ప‌టికి రోజు రోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. 24 గంట‌ల్లో 1993 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 73 మంది మృత్యువాత ప‌డ్డారు. భార‌త్‌లో ఒక రోజు వ్య‌వ‌ధిలో న‌మోదైన క‌రోనా కేసుల్లో ఇదే అత్య‌ధికం. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు 35,043 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 1,147 మంది మ‌ర‌ణించినట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశంలో రిక‌వ‌రీ రేటు 25.36శాతంగా ఉంది.

మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 8,889 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 25,007 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. భార‌త్ లో అత్య‌ధికంగా క‌రోనా కేసులు నమోద‌వుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ 10,498 కేసులు న‌మోదు కాగా.. 459 మంది మ‌ర‌ణించారు. గుజ‌రాత్‌లో 4,395, ఢిల్లీలో 3,515, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 2,660, రాజ‌స్థాన్‌లో 2,584, త‌మిళ‌నాడులో 2,323, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2,203 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story