భారత్‌లో విలయతాండవం.. అమెరికాలో కరాళనృత్యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2020 7:53 AM GMT
భారత్‌లో విలయతాండవం.. అమెరికాలో కరాళనృత్యం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లోనూ ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 8171 కేసులు నమోదు కాగా 204 మంది మృతి చెందినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 1,98,706 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా దేశంలో 8 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం నమోదైన కేసుల్లో 95,526 కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 97,581 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 5,598 మంది మృత్యువాత పడ్డారు. కరోనా కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 70,013కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 23,495, ఢిల్లీలో 20,834, గుజరాత్‌లో 17,200 కేసులు నమోదు అయ్యాయి. ఇక పప్రంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత దేశం 7వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక కరోనా మహమ్మారి చైనాలో పుట్టిన కానీ.. అమెరికాలో కరాళనృత్యం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 18లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. లక్ష మందికిపైగా మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో 743 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. బ్రెజిల్‌(4,98,440), రష్యాలో (4,05,843), యూకేలో (2,72,830), స్పెయిన్‌లో (2,39,600) లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

Next Story