భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు.. 24 గంటల్లో 5,600కేసులు.. 140 మరణాలు
By తోట వంశీ కుమార్Published on : 20 May 2020 10:31 AM IST

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 5611 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 140 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు అవ్వడం ఇదే తొలిసారి. వీటితో కలిసి ఇప్పటి వరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 3,303 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 42,298 మంది డిశ్చార్జి కాగా.. 61,149 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 37,136 కేసులు నమోదు కాగా.. 1,325 మంది మరణించారు. తమిళనాడులో 12,488, గుజరాత్‌లో 12,140, ఢిల్లీలో 10,554 కేసులు నమోదు అయ్యాయి.
Also Read
నేడు కేంద్ర కేబినెట్ భేటీNext Story