భార‌త్‌లో ల‌క్ష‌కేసులు.. మూడు వేల మ‌ర‌ణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 May 2020 4:48 AM GMT
భార‌త్‌లో ల‌క్ష‌కేసులు.. మూడు వేల మ‌ర‌ణాలు

భార‌త్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి ఉగ్ర‌రూపం దాల్చుతోంది. తాజాగా దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ల‌క్ష దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 4970 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 134 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. వీటితో క‌లిసి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 1,01,139 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 3,163 మంది మృత్యువాత ప‌డ్డారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో 39,174 మంది డిశ్చార్జి కాగా.. 58,802 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

క‌రోనా కేసులు ఎక్కువగా న‌మోదు అవుతున్న రాష్ట్రాల్లో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్రంలో 35వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 48 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య 3.18 లక్షలకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 17.86 లక్షల మంది కోలుకున్నారు.

Next Story
Share it