భారత్‌లో 24 గంటల్లో 3,390 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  8 May 2020 12:56 PM GMT
భారత్‌లో 24 గంటల్లో 3,390 పాజిటివ్‌ కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య తగ్గడం లేదు. రోజురోజుకు విశ్వరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో 3,390 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈ మేరకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో103 మంది మృతి చెందగా, ఇప్పటి వరకూ మృతుల సంఖ్య1886కు చేరింది. ఇప్పటి వరకూ భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 56,342 చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 16,539 మంది కోలుకోగా, ఆస్పత్రుల్లో 37,916 మంది చికిత్స పొందుతున్నారు అత్యధికంగా మహారాష్ట్రలో మొత్తం 17,974 కరోనా కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 7,012, ఢిల్లీలో 5,980, తమిళనాడులో 5,409 కేసులు నమోదయ్యాయి.

కాగా, భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రతి రోజు 3వేల కంటే అధికంగానే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

Next Story