ఆక్లాండ్‌ టీ20.. భార‌త ల‌క్ష్యం 133

By Newsmeter.Network  Published on  26 Jan 2020 8:47 AM GMT
ఆక్లాండ్‌ టీ20.. భార‌త ల‌క్ష్యం 133

ఆక్లాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టీ20లో కివీస్ బ్యాట్స్ మెన్లు తేలిపోయారు. టీమిండియా బౌల‌ర్ల ధాటికి ఆ జ‌ట్టు బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తొలి టీ20లో ఇదే పిచ్‌పై వీరవిహారం చేసిన కివీస్ జట్టు.. ఆదివారం జరుగుతునున్న రెండో టీ20లో మాత్రం పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. దీంతో టీమిండియా ముందు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ నిర్దేశించింది.

కివీస్‌ బ్యాట్స్‌మెన్లలో మార్టిన్‌ గప్తిల్‌ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సెయిఫర్ట్‌ (26 బంతుల్లో 33 పరుగులు, 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(2/18), దుబె(1/16), ఠాకూర్‌(1/21), బుమ్రా(1/21)లు ఆకట్టుకున్నారు. వీరితో పాటు షమీ, చహల్‌లు వికెట్లు పడగొట్టకున్నా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు.

Next Story