“బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు” అన్నాడు ఓ మహాకవి. దానిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే. అందం, శృంగారం గొప్పతనాన్ని చెబుతూ ఆ మహాకవి నవరసాల్లోకి ఒకటైన శృంగార రసంలోకి బ్రహ్మదేవుడ్ని కూడా లాగాడు.అంతేకాని..దాని పెడర్ధాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయితే.. ఈ మధ్య హీరోయిన్లు సెక్స్ విషయంలొ బాగా ఓపెన్ అవుతున్నారు.

ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్‌ కంగనా రనౌత్ సెక్స్ గురించి చాలా విపులంగా మాట్లాడింది. అంతేకాదు.. తల్లిదండ్రులు పిల్లలకు సెక్స్ పాఠాలు చెప్పాలని ఓ షో బహింరంగంగానే కామెంట్ చేసింది. సెక్స్ అనేది చాలా ముఖ్యమని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. కంగనా నుంచి మెరుపు తీగలాంటి నడుమున్న బామ ఇన్ స్పైర్ అయిందో ఏమో..సెక్స్ పాఠాలు ఓపెన్‌ గానే చెబుతుంది. మెరుపు తీగలాంటి నడుమున్న బామ అంటే ఎవరో అనుకునేరో ఆమెనండీ..ఇలియానా. బాయ్‌ ఫ్రెండ్ విడిపోయాడని వైరాగ్యమో, ఏమో సెక్స్‌  గురించి చాలా ఓపెన్‌ గా మాట్లాడుతుంది.

సెక్స్ అంటే రెండు శరీరాల కలయిక కాదు…!: ఇల్లీ

ఓ ఇంటర్వ్యూలో ఇలియానా సెక్స్‌పై తన అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టింది. ఇల్లీ మాటల్లో చెప్పాలంటే..శృంగారమంటే ఆడ, మగ కలుసుకోవడం కాదట..!. అదో  అద్భుతమైన అనుభవని ఇల్లీ అందర్నీ గిల్లింది. శృంగారంలో పాల్గొనే సమయంలో మిషన్‌లా ఉంటే టేస్ట్ ఉండదని కుండబద్దలు కొట్టింది. అంతేకాదు…శృంగారంలో ప్రేమ లేకపోతే చేసినట్లు ఉండదని చెప్పింది. ఇలియానా దృష్టిలో శృంగారమంటే పెద్ద వర్క్ అవుట్. సెక్స్ అంటే శరీరాలు కలవడం కాదు..ఆత్మలు కలవాలని పెద్ట స్టేట్ మెంటే ఇచ్చేసింది ఇలియానా. అప్పుడే ..ఈ వరల్డ్ ను జయించినంత ఆనందంగా ఉంటుందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు..తాను సెక్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తానంటూ అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది. ఇలియానాకు పెళ్లి అయిందని అనుకునేరు ఇంకా కాలేదు. పెళ్లి కాకుండానే సెక్స్ ఏంటని అనుకుంటున్నారా? . ఆమె ప్రియుడితో సెక్స్‌లో బాగా ఎంజాయ్ చేసిందని ఆమె మాటలు ద్వారా అర్ధమవుతుంది. అయితే..ఆ తన ప్రియుడు ఫొటో గ్రాఫర్‌తో ఈ మధ్యనే గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఇల్లీ సింగిల్ . మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టింది సన్నటి నడుము భామ ఇల్లీ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.