ఐజేయూకు నూత‌న ర‌థ‌సార‌థిగా శ్రీనివాస్‌రెడ్డి

By Medi Samrat
Published on : 5 Nov 2019 4:05 PM IST

ఐజేయూకు నూత‌న ర‌థ‌సార‌థిగా శ్రీనివాస్‌రెడ్డి

ముఖ్యాంశాలు

  • గ‌త అధ్య‌క్షుడు అమ‌ర్‌కు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ప‌ద‌వి
  • శ్రీనివాస్ రెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న కార్య‌వ‌ర్గం

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(IJU) కు రథసారథిగా తెలంగాణ‌కు చెందిన‌ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కె. శ్రీనివాస్ రెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. గ‌త అధ్య‌క్షుడిగా ఉన్న దేవుల‌ప‌ల్లి అమ‌ర్.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నియామకమైన సందర్భంలో ఆయ‌న‌ ఐజేయూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీలో జాతీయ కార్యవర్గం సమావేశమై శ్రీనివాస్ రెడ్డిని జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Next Story