గుడ్‌న్యూస్‌: ఆగస్ట్‌ లో కరోనా వ్యాక్సిన్‌.. ఐసీఎంఆర్‌ ప్రకటన

By సుభాష్  Published on  3 July 2020 5:23 AM GMT
గుడ్‌న్యూస్‌: ఆగస్ట్‌ లో కరోనా వ్యాక్సిన్‌.. ఐసీఎంఆర్‌ ప్రకటన

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత వైద్ఉయ పరిశోధన మండలి (ICMR) దేశ ప్రజలకు శుభవార్త వినిపించింది. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కలిసి కరోనాకు సంబంధించి 'కోవాక్సిన్‌' అనే మందును తయారు చేస్తోంది. దానిని ఆగస్ట్‌ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ఐసీఎంఆర్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది.

అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ ను పూర్తి చేసుకుని ఈ ఏడాది ఆగస్టు 15న కరోనాకు వ్యాక్సిన్‌ ను విడుదల చేయాలనుకుంటున్నాము. ఇందులో భాగంగా భారత్‌ బయోటెక్‌ ట్రయల్స్‌ ను ముమ్మరం చేసింది. ఏది ఏమైనా క్లినికల్‌ ట్రయల్స్‌ అన్ని విజయవంతంగా పూర్తయిన తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తాం.. అని ఐసీఎంఆర్‌, భారత బయోటెక్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకనటలో ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ వ్యాక్సిన్‌ తీసుకువస్తున్నాము. ఇప్పటి ఈ వ్యాక్సిన్‌ జంతువుల్లో మంచి ఫలితాలు వచ్చాయి. మనుషులపై కూడా ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి... అని తెలిపింది

ఇందు కోసం దేశ వ్యాప్తంగా 12 ఇనిస్టిట్యూట్‌లను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసినట్లు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ కేంద్రాల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ టయల్స్‌ ను నిర్వహించనున్నాము. అంతేకాదు వ్యాక్సిన్‌ పనితీరును ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. ఒక వేళ వ్యాక్సిన్‌ విజయవంతమైతే కరోనాతో దేశ ప్రజలకు మేలు జరిగినట్లే.



Icmr Vaccine For Corona1

Next Story