అవును అక్కడ వాకింగ్ చేస్తోంది అల్లు అర్జున్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 2:50 AM GMT
అవును అక్కడ వాకింగ్ చేస్తోంది అల్లు అర్జున్

అల్లు అర్జున్ కు వాకింగ్ చేయడమంటే ఎంతో ఇష్టం. ఇది ఇప్పటిది కాదు.. ఎన్నో సంవత్సరాల నుండి అలవాటు అయిపోయింది. తన కారులో అలా దూరంగా వెళ్లడం.. వాకింగ్ చేయడం.. తిరిగి ఇంటికి చేరుకోవడం. అలా అల్లు అర్జున్ వాకింగ్ చేస్తూ పలుసార్లు అభిమానుల కంటపడ్డాడు. ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి కూడానూ..!

తాజాగా అల్లు అర్జున్ తనకు వాకింగ్ అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తూ ఓ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేశారు. ఫుట్ పాత్ మీద అల్లు అర్జున్ నడుస్తూ ఉండగా.. వెనకాల నీలి ఆకాశం.. పక్కనే రోడ్డు పైన ఓ కారు ఉంది. ఈ ఫోటోను తన అభిమానుల కోసం అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. మార్నింగ్ వాక్ ను బాగా ఇష్టపడతానంటూ క్యాప్షన్ పెట్టిన బన్నీ ఈ ఫోటోలో షార్ట్స్, షూస్ ధరించిన బన్నీ చేతిలో వాటర్ బాటిల్ తో నడుస్తూ కనిపించారు. హైదరాబాద్ నగరానికి దూరంగా శివారు ప్రాంతంలో ఈ ఫోటో తీసినట్లు అర్థమవుతోంది.

అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా 'పుష్ప' అని ఇప్పటికే ప్రకటించేశారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ భారీగా ట్రెండ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. విజయ్ సేతుపతి, నివేదా థామస్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో చిత్రీకరించడమే కాకుండా రిలీజ్ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కు దక్షిణాదిన భారీ ఫాలోయింగ్ ఉండగా ఈ సినిమాను హిందీలో కూడా డైరెక్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ లు వేస్తున్నారు.

లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే ఇప్పటికే చాలా భాగం పుష్ప సినిమా షూటింగ్ పూర్తయ్యి ఉండేది. కేరళలోని అడవుల్లో పుష్ప సినిమా షూటింగ్ ను చిత్ర బృందం ప్లాన్ చేసినప్పటికీ అది వీలుపడలేదు. త్వరలోనే ఈ చిత్ర యూనిట్ షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూర్తీ అవ్వగానే కొరటాల శివతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కొరాటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో బిజీగా ఉన్నారు.

Next Story