పాకిస్తాన్‌లో మన హైదరాబాది అరెస్ట్ ఎలా..? ఎందుకు?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 2:18 PM GMT
పాకిస్తాన్‌లో మన హైదరాబాది అరెస్ట్ ఎలా..? ఎందుకు?!!

పాకిస్తాన్‌ : రాజస్థాన్ నుండి సరిహద్దు దాటడానికి ప్రయత్నించినందుకు .. ఇద్దరు భారతీయులను పాక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు భారతీయుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రశాంత్ తోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన హరిలాల్ కూడా అరెస్ట్ అయ్యాడు. పాస్‌పోర్ట్, వీసా లేకుండా పాకిస్తాన్‌లోని కొలిస్తాన్ ఎడారిలో ప్రవేశించే ప్రయత్నించారు. పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్ వద్ద వీరిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే..వీరు ఎందుకు పాక్‌ వెళ్లాలి అనుకుంది తెలియరాలేదు. ఇండియన్‌ ఎంబసీకి సమాచారం ఇచ్చే అవకాశముంది.

Next Story