హైదరాబాద్‌లో 9న జీరో షాడో డే.. సరిగ్గా ఆ సమయంలో..

హైదరాబాద్‌లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు హైదరాబాదీలు సిద్ధంగా ఉండండి. మే 9వ తేదీన మధ్యాహ్నం 12.12

By అంజి  Published on  3 May 2023 10:30 AM IST
Zero Shadow Day,  Hyderabad, Bengaluru, Birla Science Centre

హైదరాబాద్‌లో 9న జీరో షాడో డే.. సరిగ్గా ఆ సమయంలో.. 

హైదరాబాద్‌లో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు హైదరాబాదీలు సిద్ధంగా ఉండండి. మే 9వ తేదీన మధ్యాహ్నం 12.12 గంటలకు నగరంలో జీరో షాడో డే ఏర్పడనుంది. సరిగ్గా ఆ టైమ్‌లో నగరంలో నీడ మాయం అవుతుంది. ఇలా జరగడాన్నే 'జీరో షాడో డే' అంటారు. ఈ నెల 9న మధ్యాహ్నం సూర్యుని నుంచి వచ్చే కిరణాలు.. హైదరాబాద్‌లో నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఎండలో నిటారుగా (90 డిగ్రీల కోణం) ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదు. ఈ విషయాన్ని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు.

ఆ టైమ్‌లో ఎండలో మనం నిల్చుంటే.. మన నీడ కూడా కనిపించదు. ఈ జీరో షాడో డే మళ్లీ ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లో ఏర్పడుతుందని బిర్లా సైన్స్‌ సెంటర్‌ తెలిపింది. టైమ్‌లో మార్పుల వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఈ జీరో షాడో డే వస్తుంది. ఇక ఇటీవల బెంగళూరు నగరంలో ఈ అద్భుతం కనిపించింది. ఏప్రిల్‌ 25వ తేదీన మధ్యాహ్నం 12.17 నిమిషాలకు నీడ మాయమైంది. సుమారు 3 నిమిషాల పాటు నీడ భూమిపై కనిపించకపోవడాన్ని బెంగళూరు వాసులు ఆస్వాదించారు. 2021లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో కూడా ఈ అద్భుతం చోటు చేసుకుంది.

Next Story