ష‌ర్మిల కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తెస్తా

YS Sharmila meeting at Lotuspond.తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని వైఎస్ ష‌ర్మిల అన్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2021 7:51 AM GMT
YS Sharmila announcements

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని వైఎస్ ష‌ర్మిల అన్నారు. న‌ల్ల‌గొండ జిల్లా నేత‌ల‌తో ఏర్పాటు చేసిన ఆత్మీయ స‌మావేశం అనంత‌రం ష‌ర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని.. వైఎస్ఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రాజన్నరాజ్యం ఎందుకు లేదని, ఎందుకు తిరిగి తీసుకురాద‌ని ప్ర‌శ్నించారు. క్షేత్రస్తాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగిలిన జిల్లాల నేత‌ల‌తో కూడా మాట్లాడాతాన‌ని.. త్వ‌ర‌లోనే అన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌న్నారు.

ఈ సందర్భంగా ఆమెకు పలు ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయగా.. ఆమె పొడిపొడిగానే సమాధానాలు ఇచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. కొత్త పార్టీ పేరు ఏమిటనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తర్వాత చెపుతానంటూ ముందుకు సాగారు. ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన వేదిక‌పై నుంచి అభిమానుల‌కు అభివాదం చేశారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు ష‌ర్మిల‌పై కాగితపు పూల వ‌ర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాల‌తో సంద‌డి చేశారు.

ఇదిలా ఉంటే.. లోట‌స్‌పాండ్ వ‌ద్ద జ‌గ‌న్ ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల‌పై వైఎస్ఆర్‌, ష‌ర్మిల ఫోటోలు మాత్ర‌మే ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం.
Next Story