హైదరాబాద్‌లో బుధవారం కురిసిన భారీ వర్షానికి ఓ యువకుడు వరదలో కొట్టుకుపోయి విగతజీవగా కనిపించాడు. వివరాల్లోకి వెళ్తే.. కవాడిగూడకు చెందిన 27 ఏళ్ల యువకుడు మహ్మద్ షరాపుద్దీన్ బల్కంపేట వంతెన అండర్‌పాస్ సమీపంలో తన మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగి వెళుతుండగా నీటిలో కొట్టుకుపోయాడు.
బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక యువకులు అతని మృతదేహాన్ని నీటిలో నుండి వెలికి తీశారు. కాగా షరాఫుద్దీన్ కృత్రిమ అవయవాలను తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే కవాడిగూడ నుండి బాలానగర్‌లోని తన కార్యాలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై మృతుడి సోదరుడు మహ్మద్ బిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని మల్లేపల్లి వద్ద ఉన్న అఫ్జల్‌సాగర్ నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తులు అర్జున్ , రాము ఆచూకీ తెలియలేదు. మరో సంఘటనలో, ముషీరాబాద్‌లోని నాలాలో పడి ఒక వ్యక్తి తప్పిపోయాడు. మూడు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీని కనుగొనలేకపోయింది.