ఎంఐఎం కార్పొరేటర్ మేనల్లుడి దారుణ హత్య
Youngster murdered at AIMIM corporator’s office in Old City. హైదరాబాద్: పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని లలితాబాగ్‌లోని ఏఐఎంఐఎం
By అంజి Published on 20 Dec 2022 4:51 AM GMTహైదరాబాద్: పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోని లలితాబాగ్‌లోని ఏఐఎంఐఎం డివిజన్ 36 కార్పొరేటర్ మహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయం రక్తసిక్తమైంది. 36 కార్పొరేటర్ మహమ్మద్ అలీ షరీఫ్ (ఆజం) మేనల్లుడు.. 21 సయ్యద్ ముర్తుజా అనాస్‌పై పట్టపగలు ఇద్దరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. యువకుడు కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగా, ఇద్దరు దుండగులు బ్లేడుతో అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. దాడి సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు ముర్తుజా మెడపై తీవ్రమైన గాయం చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
యువకుడి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని కంచన్‌బాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సయ్యద్ ముర్తుజా అన్వర్-ఉల్-ఉలూమ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సోమవారం అతడిని యూనస్, వికార్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు 2-3 కిలోమీటర్ల మేర వెంబడించినట్లు సమాచారం. ఇది చివరకు మొయిన్‌పురాలోని అతని మేనమామ కార్యాలయంలో ముగిసింది. ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలోకి చొరబడి పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీంతో సయ్యద్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులకు, సయ్యద్‌కు గతంలో గొడవలు జరిగాయి. నిందితులు యూనస్, వికార్ సయ్యద్ స్నేహితుడి బంధువులు. అతనికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం. అయితే, దాడి అతని మరణంతో ముగిసింది. ఈ ఘటనపై జరిపిన విచారణలో సయ్యద్, నిందితులు వ్యక్తిగత శత్రుత్వం కారణంగా 6 నెలలుగా మాటల తూటాలకు పాల్పడ్డారని తేలింది. తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన నిందితులను సౌత్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఐఎంఐఎం పార్టీకి చెందిన మహ్మద్ అలీ షరీఫ్ రెండోసారి కార్పొరేటర్, అక్బర్ ఉద్దీన్ ఒవైసీకి సన్నిహితుడు. సయ్యద్ కార్పొరేటర్ సోదరి కొడుకు.