Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..

పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

By -  అంజి
Published on : 3 Feb 2026 10:25 AM IST

Hyderabad, Young woman, suicide, Hussain Sagar, marriage

Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య.. పెళ్లి కావడం లేదని..

హైదరాబాద్‌: పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఓ యువతి హుస్సేన్‌ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయలక్ష్మీ అనే యువతి తన తల్లితో కలిసి మైత్రినగర్‌లో ఉంటోంది. మాదాపూర్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్న ఆమెకు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో పాటు తల్లి అనారోగ్యం కారణంగా మానసిక ఒత్తిడి పెరిగినట్టు పోలీసులు తెలిపారు.

ఇటీవల విజయలక్ష్మీకి పెళ్లి సంబంధాలు రావడంతో వివాహం అనంతరం తల్లి దివ్యాంగురాలు కావడంతో తనతో పాటే ఉంటుందని చెప్పడంతో సంబంధాలు వెనక్కిపోయాయి. దీంతో మనస్తాపంతో విజయలక్ష్మీ జనవరి 31న ట్యాంక్‌బండ్‌కు చేరుకుని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Next Story