'మార్ఫింగ్‌ ఫొటోలు నెట్‌లో పెడతా'.. బాలికకు ఆకతాయి వేధింపులు

ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో చేయకుంటే ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ 15 ఏళ్ల బాలికను బెదిరింపులకు గురి చేశాడో ఆకతాయి.

By అంజి  Published on  21 Aug 2023 11:06 AM IST
Young Man, Hyderabad, Teenage Girl, Instagram, Harassment

'మార్ఫింగ్‌ ఫొటోలు నెట్‌లో పెడతా'.. బాలికకు ఆకతాయి వేధింపులు

ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో చేయకుంటే ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ 15 ఏళ్ల బాలికను బెదిరింపులకు గురి చేశాడో ఆకతాయి. ఆకతాయి వేధింపులపై మైనర్ బాలిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జవహర్‌నగర్‌కు చెందిన ఓ బాలిక గత నెల 23వ తేదీన కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా, ముఖానికి మాస్క్‌ ధరించిన ఓ గుర్తు తెలియని యువకుడు బాలికను అడ్డుకున్నాడు. ఆమె ఫొటోలు తన ఫోన్‌లో ఉన్నాయంటూ.. తన ఫోన్‌లోని ఫొటోలు చూపించి బెదించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో కావాలని, ప్రతిరోజు తనతో చాట్‌ చేయాలని వేధించాడు.

తనతో చాట్‌ చేయకపోయినా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కాకపోయినా.. వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేస్తానని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పితే చంపేస్తానని బెదిరించాడు. భయబ్రాంతులకు గురైన బాలిక తనను వేధింపులకు గురి చేయవద్దని వేడుకుంది. అయినా వినని ఆ ఆకతాయి.. మళ్లీ ఈనెల 16న బాలికను రోడ్డుపై ఆపి, ఆమె చేతిపై ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ రాశాడు. ఫాలో కాకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. మధురానగర్‌ పోలీసులకు గుర్తు తెలియని యువకుడి వేధింపులపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్‌ పోలీసులు ఆకతాయిపై పోక్సో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story