అతివలకు చేరువగా సిటీ ఆర్టీసీ.. చెయ్యెత్తితే బ‌స్సు ఆగాల్సిందే

Women can now stop and board TSRTC buses anywhere.మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 July 2021 8:39 AM IST
అతివలకు చేరువగా సిటీ ఆర్టీసీ.. చెయ్యెత్తితే బ‌స్సు ఆగాల్సిందే

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోని సిటీ బ‌స్సుల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌కు టీఎస్ ఆర్టీసీ స‌రికొత్త వెసులుబాటు క‌ల్పించింది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌స్టాపులులో మాత్ర‌మే బ‌స్సులు ఆగేవి. ఇక‌పై రాత్రి 7.30 త‌రువాత మ‌హిళ‌లు ఎక్క‌డ చెయ్యి ఎత్తితే అక్క‌డ ఆగేలా.. వారు కావాలి అనుకున్న చోట దిగేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సౌక‌ర్యం మంగ‌ళ‌వారం నుంచి అందుబాటులోకి రానుంది.

మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ మేరకు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్‌లను ఆదేశించినట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్‌లకు ఫిర్యాదు చేయొచ్చున‌న్నారు. మ‌రోవైపు ముఖ్య‌మైన బ‌స్టాపుల్లో రాత్రి 10 వ‌ర‌కు బ‌స్సుల నియంత్ర‌ణ అధికారులుండేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక ఏపీ ఉద్యోగుల ప్ర‌త్యేక రైలు ఇంట‌ర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను పున‌రుద్ద‌రించ‌డంతో అందులో వ‌చ్చే ప్ర‌యాణీకుల సౌక‌ర్యార్థం సిటీ బ‌స్సులు కూడా అందుబాటులో ఉంటాయ‌ని ఈడీ చెప్పారు.

Next Story