Hyderabad: రోడ్డుపై నిలిచిన నీటిలో కూర్చొని మహిళ వినూత్న నిరసన

నాగోల్‌-బండ్లగూడ రహదారిలోని ఆనంద్‌నగర్‌ వద్ద రోడ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆమె వాపోయింది.

By Srikanth Gundamalla  Published on  23 May 2024 4:03 PM IST
woman, protest,   flood water, viral video, Hyderabad ,

 Hyderabad: రోడ్డుపై నిలిచిన నీటిలో కూర్చొని మహిళ వినూత్న నిరసన

హైదరాబాద్ నగరంలో జనాభా ఎక్కువగానే ఉంటుంది. రోడ్లపై నిత్యం వాహనాలు తిరుగుతుంటాయి. అంతేకాదు.. ఇక్కడ ఒక్కసారిగా వర్షం పడిందంటే చాలు జనజీనవంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రోడ్లపైకి నీరు వచ్చి చేరుతాయి. వర్షం ఎక్కువగా పడితే పలు కాలనీలు అయితే నీటమునిగిపోతాయి. మరికొన్ని రోడ్లు చెరువులను తలపిస్తాయి. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో రోడ్డు చెడిపోతుంటాయి. వీటి వల్ల కూడా నగరవాసులకు ఇబ్బందులు తప్పవు. పలుమార్లు నగరవాసులు ఆయా ప్రాంతాల్లో రోడ్ల గురించి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా నాగోల్‌ పరిధిలో కూడా పాడైపోయిన రోడ్లను పట్టించుకోవడం లేదని ఓ మహిళ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది.

రోడ్లను అధికారులు పట్టించుకోవడం లేదని.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు చేరి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఓ మహిళ ఆందోళన చేపట్టింది. నాగోల్‌-బండ్లగూడ రహదారిలోని ఆనంద్‌నగర్‌ వద్ద రోడ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆమె వాపోయింది. వాన నీరు గుంతల్లో నిలవడం వల్ల వాహనదారులకే కాదు.. పాదాచారులకు కష్టాలు తప్పడం లేదని ఆమె అంటున్నారు. వర్షపు నీరు గుంతల్లో చేరుకోవడంతో అవి నీడిపోయాయి. దాంతో.. ఆమె ఆ నీటిలోనే కూర్చొని నిరసన తెలిపారు. కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం ఉందనీ.. వెంటనే అధికారులు స్పంచాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇక సదురు మహిళ వర్షపు నీటిలో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తుండటాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను అందులో నుంచి లేవాలనీ.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఆమె వినూత్న నిరసనను సెల్‌ఫోన్లో వీడియో కార్డు చేశారు. ఇప్పుడా వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. పలువురు హైదరాబాద్ నగర వాసులు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. తమ వద్ద కూడా రోడ్లు బాగోలేవంటూ చెప్పుకొస్తున్నారు.


Next Story