Hyderabad: 20 కిలోల గంజాయి పట్టివేత.. లేడీ స్మగ్లర్ అరెస్ట్

హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో లేడీ గంజాయి స్మగ్లర్‌ నీతూ భాయ్‌ని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  14 March 2024 11:10 AM IST
ganja , Nanak Ram Guda,Hyderabad

Hyderabad: 20 కిలోల గంజాయి పట్టివేత.. లేడీ స్మగ్లర్ అరెస్ట్

పుష్ప సినిమాలో హీరో తరహాలో ఓ లేడీ కిలాడి తగ్గేదేలే అన్నట్లుగా మగ వారికి దీటుగా... పోలీసులు చేతికి చిక్కకుండా రహస్యంగా డ్రగ్స్ అమ్మి కోట్లు సంపాదించింది.. కానీ చివరికి లేడి కిలాడీ పోలీసుల చేతికి చిక్కి కటకటాల వెనక్కి వెళ్ళింది. గంజాయి స్మగ్లింగ్‌పై సైబరాబాద్ ఎస్ఓటి బృందం ఉక్కు పాదం మోపుతోంది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌ గూడలో లేడీ గంజాయి స్మగ్లర్‌ నీతూ భాయ్‌ని సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఇంట్లో 20 కిలోల గంజాయి, రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

నీతూ భాయ్‌ గతంలో రెండుసార్లు గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. మహిళ గంజాయి అమ్ముతుండటంతో నగరంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. నీతూ భాయ్‌ చూడటానికి సాధారణ గృహిణిలా కనిపిస్తుంది. కానీ.. ఆమె గంజాయి స్మగ్లింగ్‌లో ఆరి తేరింది. 2017లోనే శేరలింగంపల్లి ఎక్సైజ్‌ పోలీసులు ఆమోపై కేసు నమోదు చేశారు. 2021 సెప్టెంబర్‌ వరకు ఆమెపై 12 కేసులు నమోదు కావడంతో పీడీ చట్టం ప్రయోగించారు. ఏడాది అనంతరం జైలు నుంచి తిరిగి వచ్చినా గంజాయి స్మగ్లింగ్‌ను ఆపడం లేదు.

Next Story