మరిన్ని భాషలు నేర్చుకోవాలంటే మనం ఏమి చేయాలి? 'పరీక్ష పే చర్చ' సందర్భంగా ప్రధానమంత్రిని అడిగిన TS విద్యార్థిని అక్షర

What can we do to learn more languages? TS student Akshara asks PM during 'Pariksha Pe Charcha'.రంగారెడ్డి జిల్లాకు చెందిన అక్షర సిరి రామిశెట్టికి ప్రధానమంత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 5:42 AM GMT
మరిన్ని భాషలు నేర్చుకోవాలంటే మనం ఏమి చేయాలి? పరీక్ష పే చర్చ సందర్భంగా ప్రధానమంత్రిని అడిగిన TS విద్యార్థిని అక్షర

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాకు చెందిన అక్షర సిరి రామిశెట్టికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నేరుగా మాట్లాడే అవకాశం రావడం ఆమెకు మ‌రిచిపోలేని ఓ అంద‌మైన క్ష‌ణం.

జవహర్ నవోదయ విద్యాలయంలో అక్ష‌ర ప‌ద‌కొండోత‌ర‌గ‌తి చ‌దువుతోంది. జ‌న‌వ‌రి 21న త‌న పాఠ‌శాల‌లో పరీక్ష పే చర్చ' అనే అంశంపై వ్యాస ర‌చ‌న పోటీ నిర్వ‌హించార‌ని అక్ష‌ర న్యూస్‌మీటర్‌తో చెప్పారు.

“పోటీ తర్వాత ఎంపికైన ఆరుగురు విద్యార్థులలో నేను ఒకరు. ఆ తర్వాత మమ్మల్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ టి గోపాల కృష్ణ, స్కూల్ ప్రిన్సిపాల్ డేనియల్ ర‌త్నకుమార్ ఇంటర్వ్యూ చేశారు. ఆ విధంగానే నేను మన ప్రధాని నరేంద్ర మోదీని 'పరీక్ష పే చర్చ'పై ఒక ప్రశ్న అడగడానికి ఎంపికయ్యాను అని ఆమె చెప్పింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పరీక్ష పే చర్చ’ ఆరవ ఎడిషన్‌లో దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న అక్ష‌ర ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీని మరిన్ని భాషలు నేర్చుకోవడానికి మనం ఏమి చేయాలి? అనే ప్ర‌శ్న‌ను అడిగింది.

ప్రశ్న: మరిన్ని భాషలు నేర్చుకోవాలంటే మనం ఏమి చేయాలి?

ప్రధాని మోదీ : ఒక భాష నేర్చుకోవాలంటే, ఆ ప్రదేశం, ప్రజల సంస్కృతి మరియు వైవిధ్యంలో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. మన హృదయాన్ని, ఆత్మను ల‌గ్నం చేయాలి. మన మాతృభాష నేర్చుకోవడమే కాకుండా, భారతీయులందరూ ఇతర పదబంధాలను నేర్చుకోవాలి.

పరీక్షా పే చర్చా అనేది పరీక్షలను ఒత్తిడి లేకుండా చేయడంలో సహాయపడే అత్యంత ఉత్తేజకరమైన కార్యక్రమాలలో ఒకటి. ఈ కార్యక్రమాన్ని గత ఐదేళ్లుగా పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ విజయవంతంగా నిర్వహిస్తోంది.

జనవరి 27న, రాబోయే బోర్డు పరీక్షల గురించి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో మోదీ సంభాషించారు. కార్యక్రమంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు, ఎంపికైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్నారు. ఇది గతేడాది కంటే కనీసం 15 లక్షలు ఎక్కువ.

Next Story