హైదరాబాద్‌: రేపు ఈ ఏరియాల్లో నీటి సప్లయ్‌ బంద్

Water supply disruption to many parts of Hyderabad tomorrow. హైదరాబాద్‌ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

By అంజి  Published on  16 Nov 2022 4:49 AM GMT
హైదరాబాద్‌: రేపు ఈ ఏరియాల్లో నీటి సప్లయ్‌ బంద్

హైదరాబాద్‌ మహానగరంలోని కొన్ని ప్రాంతాల్లో రేపు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నవంబర్ 17 తెల్లవారుజామున 4 గంటల నుంచి 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఎల్‌బీ నగర్‌, మన్సూరాబాద్‌ వద్ద నీటి పైపులైన్‌ లీకేజీని పరిష్కరించేందుకు చేపట్టనున్న పనుల్లో భాగంగా నీటి సప్లయ్‌ బంద్‌ కానుంది. దీంతో ఉప్పల్, రామంతపూర్, శ్రీ సాయి ఆర్టీసీ కాలనీ, ఆదర్శ్ నగర్, వెంకట్ సాయి నగర్, శ్రీకృష్ణ కాలనీ, పాత పీర్జాదిగూడ, మల్లికార్జున నగర్ (ఫేజ్ I), భవానీ నగర్ కాలనీల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

ఈ ఏరియాలతో పాటు కుత్బుల్లాపూర్, ఎన్టీఆర్ నగర్ బస్తీ, వాస్తు కాలనీ, శివగంగ కాలనీ, శివమ్మ బస్తీలలో కూడా నీటి సరఫరా నిలిచిపోతుంది. పై ప్రాంతాల నివాసితులు అసౌకర్యానికి గురికాకుండా నీటిని అవసరం మేరకు ఉపయోగించుకోవాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కోరింది.

హైదరాబాద్‌లో నవంబర్‌లో రెండోసారి నీటి సరఫరాకు అంతరాయం

నెల రోజుల్లో ఇది రెండోసారి. గతంలో కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల ప్రారంభంలో బీహెచ్‌ఈఎల్ ఎంఐజీ కాలనీ, బీహెచ్‌ఈఎల్ ఎల్‌ఐజీ కాలనీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ హోమ్‌తో సహా ప్రాంతాల్లో 24 గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగింది. సింగూర్‌ ఫేజ్‌-3 పైప్‌లైన్‌ మరమ్మతు పనులు ఇక్రిసాట్‌ వద్ద జరుగుతుండటంతో.. నల్లగండ్ల, హుడా కాలనీ, గోపనపల్లి, మయూరి నగర్, మాదాపూర్, గోకుల్ ప్లాట్లు, మలేషియన్ టౌన్‌షిప్‌లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Next Story