20 నిమిషాల పాటు గాల్లోనే సందర్శకులు..నాంపల్లి నుమాయిష్‌లో ఊహించని ప్రమాదం
నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఊహించని ఘటనను చూసి అక్కడికి వెళ్లిన సందర్శకులు షాక్‌కు గురయ్యారు.
By Knakam Karthik Published on 17 Jan 2025 11:49 AM IST
20 నిమిషాల పాటు గాల్లోనే సందర్శకులు..నాంపల్లి నుమాయిష్‌లో ఊహించని ప్రమాదం
నాంపల్లి గ్రౌండ్‌లో ప్రతి ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఊహించని ఘటనను చూసి అక్కడికి వెళ్లిన సందర్శకులు షాక్‌కు గురయ్యారు. పిల్లల అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో ఉండే.. డబుల్ ఆర్మ్ రేంజర్, సరిగా పని చేయకపోవడంతో దాదాపు 20 నిమిషాలు సందర్శకులు గాల్లోనే తేలియాడారు. అమ్యూజ్‌మెంట్ రైడ్‌కు వెళ్లిన సందర్శకులు తలకిందులుగా ఇరుక్కుపోవడంతో భయాందోళనకు గురయ్యారు. విషయం గమనించిన సిబ్బంది దాదాపు అరగంట పాటు శ్రమించి రైడ్‌లో చిక్కుకున్న వారిని సేఫ్‌గా బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే డబుల్ ఆర్మ్ రేంజర్ ఎంతో థ్రిల్ ఇస్తుంది. అందులో కూర్చునేవారు, రివర్స్‌లో టర్న్ అవుతారు, రెండు ఆర్ములూ, పైకి లేస్తూ.. రౌండ్‌గా తిరుగుతాయి. దాంతో థ్రిల్ పొందుతూ కేరింతలు కొడతారు. అయితే నిన్న జరిగిన ఈ ఊహించని ఘటనతో కేరితంలేమో కానీ గావు కేకలు పెట్టారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం ఎదురుచూశారు. మెషీన్‌లో టెక్నికల్ ఇష్యూ రావడంతో రెండు చేతులూ పైకి లేచి. గాల్లో ఉండిపోయాయి. దాంతో లోపలున్న సందర్శకులు తమ పరిస్థితి ఏంటని నానా హైరానా పడ్డారు. వాళ్లు సీట్లలో కూర్చునే పరస్థితి లేదు. రివర్స్‌లో వేలాడుతూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక టెన్షన్‌లో ఉండిపోయారు.
అమ్యూజ్‌మెంట్ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా మధ్యలోనే నిలిచిపోవడంతో అందులోని సందర్శకులు తలకిందులుగా అయ్యారని నిర్వాహకులు తెలిపారు. బ్యాటరీలో తలెత్తిన టెక్నికల్ సమస్య కారణంగా రైడ్ మధ్యలోనే ఆగిపోయినట్లు చెప్పారు. ప్రాబ్లమ్‌పై సమాచారం తెలుసుకున్న వెంటనే టెక్నీషియన్‌ను పిలిపించి బ్యాటరీలు మార్పించామని, రైడ్ కంటిన్యూ అయినట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని, గాయాలు కాలేదన్నారు.