హైదరాబాద్‌: ఏటీఎంలో భారీ చోరీ.. నగదు అపహరణ

Vanasthalipuram ATM Robbery.. హైదరాబాద్‌లోని వనస్థలిపరం ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్‌లను

By సుభాష్  Published on  16 Nov 2020 2:26 PM IST
హైదరాబాద్‌: ఏటీఎంలో భారీ చోరీ.. నగదు అపహరణ

హైదరాబాద్‌లోని వనస్థలిపరం ఏటీఎం సెంటర్‌లో భారీ చోరీ జరిగింది. ఏటీఎం మెషిన్‌లను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేసి ఏటీఎంలో ఉన్న నగదును అపహరించుకుపోయారు దుండగులు. ఈ చోరీ వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని సహారా రోడ్‌లో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విషయాన్ని తెలుసుకున్న రాచకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగతనం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడిన దొంగల కోసం నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటన స్థలానికి క్లూస్‌ టీం చేరుకుని పరిశీలించింది.

ఏటీఎం చోరీ చేయడానికి మొత్తం ఐదు మంది ముఠా సభ్యులు కారులోకి వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దుండగుల్లో ఏటీఎంలోకి గ్యాస్‌ కట్టర్‌తో ఒక్కరూ మాత్రమే వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, నాలుగేళ్ల కిందట ఇదే ఏటీఎంలో ఈ దుండగులు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండో సారి కూడా చోరీ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎం నుంచి దుండగులు ఎంత మొత్తాన్ని ఎత్తుకెళ్లారనే విషయం తెలియాల్సి ఉంది.

Next Story