విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన యూఎస్ కాన్సులేట్

అమెరికాకు వెళ్లి చదవాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌ల మొదటి విడతను విడుదల చేసింది.

By M.S.R  Published on  8 May 2024 9:48 AM GMT
విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన యూఎస్ కాన్సులేట్

అమెరికాకు వెళ్లి చదవాలనుకుంటున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ మే నెలాఖరులో జరిగే ఇంటర్వ్యూల కోసం స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్ స్లాట్‌ల మొదటి విడతను విడుదల చేసింది. అంతేకాకుండా వచ్చే వారాల్లో, జూన్, జూలై, ఆగస్టు నెలలకు కాన్సులేట్ అదనపు అపాయింట్‌మెంట్ బ్యాచ్‌లను విడుదల చేస్తుంది.

భారతదేశంలోని యుఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు 140,000 కంటే ఎక్కువ స్టూడెంట్ వీసాలను విడుదల చేసింది. ఇది ఆల్-టైమ్ రికార్డ్‌ అని విదేశాంగ శాఖ ప్రకటించింది. US కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఇతర దేశాల నుండి వచ్చి చదువుకునే విద్యార్థుల కారణంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి USD 38 బిలియన్ల వరకు ఆదాయం ఉంటుంది. జూన్-ఆగస్టు 2023, ప్రధాన స్టూడెంట్ వీసా సీజన్‌లో US కాన్సులర్ అధికారులు F, M, J కేటగిరీలలో 95,269 వీసాలను జారీ చేశారు. 2022 కంటే 18 శాతం పెరుగుదలను గత ఏడాది నమోదు చేసింది. ఓపెన్ డోర్స్ రిపోర్ట్ డేటా ప్రకారం, 2009/10 తర్వాత మొదటిసారిగా USలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులలో భారతదేశం నుండి వెళ్లిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయంలో భారత్ చైనాను అధిగమించింది.

Next Story