భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్
UP CM Yogi visits Bhagyalaxmi Temple at Charminar.భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు
By తోట వంశీ కుమార్ Published on
3 July 2022 4:58 AM GMT

భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు(ఆదివారం) ఉదయం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా యోగి అమ్మవారికి స్వయంగా హారతిచ్చారు.
సీఎం యోగితో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. దాదాపు 10లక్షల మంది ఈ సభకు తరలించాలని కమలనాథులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
Next Story